Site icon Bhakthi TV

హనుమకు కొత్త రాగాన్ని ఆలపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఒకప్పుడు రాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు. త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు. అప్పుడు రాక్షసుడు యజ్ఞం ధ్వంసం చేయబోగా, హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తుండగా అప్పుడు ఆంజనేయుడు ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటి వరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడాడట. ఆ గుహ శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.

హనుమకు కొత్త రాగాన్ని ఆలపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

కపీశ అంటే అర్థం ఏమిటి?
కపీశ అంటే… కపులకు ఈశుడు. కపి రూపంలో ఉన్న ఈశుడు
కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.

హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు. అంతే కాక గంధమాదన పర్వతంపై ఇప్పటికీ ఉన్నాడని చెబుతారు.

అతులిత బలధామా అంటే అర్థం?
హనుమంతుడిని అతులిత బలధామా అని అంటారు. అంటే ఎవ్వరితోనూ పోల్చ లేని బలం కలిగిన వాడు అని అర్థం. అందుకే సీతాన్వేషణ కోసం శ్రీరాముడు.. ఆంజనేయుడిని ఎంచుకున్నాడని అంటారు.

Share this post with your friends
Exit mobile version