Site icon Bhakthi TV

లక్ష్మీదేవి ఎవరి కూతురు?

ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి. లోకులంతా లక్షించేది లక్ష్మిని..! లక్షించటం అంటే.. చూడటమని అర్థం..! లక్ష్మి తన చల్లని చూపులతో.. లోకాన్ని చూస్తూ ఉంటుంది. అంటే..! పాలిస్తున్నదన్నమాట..! లక్ష్మి ఒక్క సంపద రూపంలోనే ఉంటుందనుకుంటారు కొందరు. వాస్తవానికి లక్ష్మి.. జ్ఞానం.. ఆనందం.. తృప్తి.. మోక్షం..

ఐశ్వర్యం.. తదితర అనేక రూపాల్లో.. మన దరికి చేరుతుంది..! భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు లక్ష్మి జన్మించింది. భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే శుక్రవారానికి భృగువారమని పేరు..!

లక్ష్మికి ‘భార్గవి’ అనే పేరు కూడా ఉంది..! భృగువు లక్ష్మిని.. శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. లక్ష్మిని.. సిద్ధలక్ష్మి.. మోక్షలక్ష్మి.. జయలక్ష్మి.. సరస్వతి.. శ్రీలక్ష్మి.. వరలక్ష్మి.. తదితర రూపాల్లో ఆరాధిస్తారు. ‘లక్ష్మీదేవి.. తనను.. ఆరాధించే వారందరినీ.. శిష్టులు-దుష్టులు..అనే తేడా లేకుండా.. అనుగ్రహించడం మొదలు పెట్టిందట..! అధర్మవర్తులను సైతం ఇలా అనుగ్రహిస్తుంటే చూసిన విష్ణుమూర్తి..”నువ్వీ జన్మ చాలించి.. పాలకడలిలో జన్మించు..!” అన్నాడు. మందహాసం చేస్తూ.. మాట పట్టింపు కొద్దీ లక్ష్మి ఆ అవతారం చాలించి.. పాలకడలిలో ఉద్భవించింది.

Share this post with your friends
Exit mobile version