Site icon Bhakthi TV

రాహు, కేతవులు ఎవరంటే..

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతం కోసం రాక్షసులు.. దానవులతో కొట్లాటకు దిగారు. అప్పుడు శ్రీహరి మోహిని అవతారం దాల్చి దేవతలకు అమృతాన్ని అందించాడు. మాయోపాయంతో అమృతాన్ని పొందిన రాహువు అనే రాక్షసుడిని శ్రీహరి తన సుదర్శన చక్రంతో రెండుగా ఖండించాడు. ఆ రెండు భాగాలే రాహు, కేతువులని పురాణాలు చెబుతున్నాయి. సూర్యచంద్రులు వల్లనే తమ గురించి శ్రీహరికి తెలిసిందన్న ఆగ్రహం రాహుకేతువుల్లో ఎప్పుడూ ఉంటుందట. అందుకే వారు అప్పుడప్పుడు సూర్యచంద్రులను మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అంటాము.

రాహు, కేతవులు ఎవరంటే..

ఇక శ్రీహరి మోహిని అవతారాన్ని వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వీకరించాడట. అందుకే ఆ రోజున మనం మోహిని ఏకాదశిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజిస్తే మనం కోరకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం. అలాగే ఈ రోజున స్వామివారికి మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్కెర పొంగలి వంటి నైవేద్యాలను సమర్పించాలి. సంధ్యా సమయంలో తిరిగి విష్ణుమూర్తికి పూజ చేయాలి. అనంతరం క్షీరసాగర మథనం ఘట్టాన్ని, శ్రీహరి మోహిని అవతార విశిష్టతను పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిత్య పూజ చేసిన మీదట ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి ఉపవాసాన్ని విరమించవచ్చు.

Share this post with your friends
Exit mobile version