Site icon Bhakthi TV

హనుమంతుడిని తులసీదాస్ ఏం కోరాడంటే..

తులసీదాస్‌ను పాదుషా ఆదేశానుసారం సైనికులు బంధించేందుకు యత్నించగా.. పెద్ద ఎత్తున కోతులు వారిని చుట్టుముట్టాయి. తులసీదాస్ ధ్యానసాగరంలో మునిగిపోగా.. ఆయనకు హనుమంతుడు సింహద్వారంపై ఆసీనులైనట్టుగా దర్శనమిచ్చాడు. హనుమ దర్శనంతో పులకించిపోయిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో కూడా హనుమాన్ చాలీసాను పఠించాడు. తులసీదాస్ స్తోత్రానికి పవన సుతుడు పరమానంద భరితుడయ్యాడు. ఏం కావాలో కోరుకోమని ఆంజనేయుడు చెప్పాడు. అప్పుడు హనుమతో తులసీదాస్.. “స్వామీ! నేటి నుంచి ఈ స్తోత్రం హనుమాన్ చాలీసాగా ప్రచారంలోకి వస్తుందని చెప్పాడు.

హనుమంతుడిని తులసీదాస్ ఏం కోరాడంటే..

ఈ స్తోత్రంతో హనుమంతుడిని స్తుతించిన వారిని అభయమిచ్చి రక్షించమని విన్నవించుకున్నాడు. తులసీదాసు నిస్వార్ధ కోరికను విన్న హనుమంతుడు సంతోషించాడు. ఆ తరువాత “తులసీ! ఈ హనుమాన్ చాలీసా నాకు అత్యంత ప్రియమైనదని.. ఈ స్తోత్రంతో తనను స్తుతించిన వారి రక్షణ భారం నేనే వహిస్తానని హనుమంతుడు వాగ్దానం చేశాడట. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తానే ఉంది. ఇంతటి మహిమాన్వితమైన హనుమాన్ చాలీసాను మనం కూడా హనుమంతుడికి ఇష్టమైన మంగళవారంతో పాటు ప్రతి శనివారం భక్తితో పఠిస్తే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు.

Share this post with your friends
Exit mobile version