Site icon Bhakthi TV

కన్యా సంక్రమణం ఏ ఆచారాలు నిర్వహించాలంటే..

కన్యా సంక్రమణం నాడు సూర్యుడిని ఆరాధించడంతో పాటు పితృదేవతలను స్మరించుకోవాలని ముందుగానే తెలుసుకున్నాం కాదు. ఈ రోజున పూర్వీకులకు పిండ ప్రదానం చేసి.. తర్పణం, శ్రాద్ధం వంటి ఆచారాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ కన్యా సంక్రమణం.. మహాలయ పక్షాలలో వస్తుంది. మహాలయ పక్షాలను పితృపక్షాలుగా పిలుస్తారు. ఈ కన్యా సంక్రమణం సందర్భంగా చేసే పిండ ప్రదానాలు, దానాల కారణంగా పితృ దేవతలు సంతోషిస్తారని చెబుతారు.

కన్యా సంక్రమణం రోజు చేయాల్సిన పూజలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ధార్మిక కార్యాలు, పూజలు, జపాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. వృత్తి పరమైన సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజున చేసే స్నాన, దాన, జపాల వలన జాతకంలో సూర్యుని స్థానం బలపడి.. సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి. అది చేయలేని వారు నెయ్యి, బెల్లం, గోధుమల వంటివి దానం చేయవచ్చు.

Share this post with your friends
Exit mobile version