Site icon Bhakthi TV

దుర్యోధనుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే..

దుర్యోధనుడు నేలకొరిగిన తరువాత శ్రీకృష్ణుడికి మూడు వేళ్లు చూపించాడు. దగ్గరికి వెళ్లిన శ్రీకృష్ణుడికి తను చేసిన మూడు తప్పుల గురించి దుర్యోధనుడు చెప్పాడు. అవే చేయకుంటే తనకు ఓటమి ఉండేది కాదని వెల్లడించాడు. మరి ఆ తప్పులేంటి? తెలుసుకుందాం. తన మొదటి తప్పు శ్రీకృష్ణుడిని ఎంచుకోకపోవడమేనని తెలిపాడు. శ్రీకృష్ణుడిని ఎంచుకోకుండా ఆయన సైన్యాన్ని ఎంచుకుని తప్పు చేశానన్నాడు. తాను శ్రీకృష్ణుడిని ఎంచుకుని ఉంటే యుద్ధం గెలిచి ఉండేవాడినన్నాడు. రెండవ తప్పు.. గాంధారి తనను నగ్నంగా నిలబడమని చెబితే నిలబడకుండా తల్లి మాట పెడచెవిన పెట్టి తప్పు చేశానన్నాడు.

తన నడుముకి దుస్తులు ధరించి తల్లి దగ్గరకు వెళ్ళానని.. అలా వెళ్లకుంటే తననెవరూ చంపలేకపోయేవారని తెలిపాడు. ఇక దుర్యోధనుడు చెప్పిన మూడో తప్పు ఏంటంటే.. తాను యుద్ధానికి చివరిగా వెళ్లానని.. తను ముందే వెళ్లి ఉంటే.. తన సోదరులు, బంధువులందరి ప్రాణాలను కాపాడి ఉండేవాడినని తెలిపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రెండు వేళ్లు చూపించి చెప్పనారంభించాడు. దుర్యోధనుడి ఓటమికి మొదటి కారణం అధర్మ మార్గంలో నడవడమైతే.. రెండో కారణం.. ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణమని చెప్పాడు. దుర్యోధనుడు చేసిన తప్పులే అతని ఓటమికి ఆపై మృత్యువుకి కారణమని తెలిపాడు.

Share this post with your friends
Exit mobile version