Site icon Bhakthi TV

తను చనిపోయే ముందు శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు ఏం చెప్పాడంటే..

మహాభారత యుద్ధం చివరి దశకు చేరుకుంది. కౌరవసేన మొత్తం హతమయ్యారు. ఏ మందీ మార్బలాన్ని అయితే చూసుకుని గర్వపడ్డాడో వారందరి మరణంతో దుర్యోధనుడికి గర్వభంగం అయ్యింది. ఒంటరిగా చావు కోసం ఎదురు చూస్తున్నాడు. పాండవులకు ఐదు గ్రామాలిచ్చినా చాలు.. యుద్ధం వద్దంటూ ఎంతమంది చెప్పినా దుర్యోధనుడు చెవికెక్కించుకోలేదు. శాంతి మార్గంలో నడిచేందుకు ఎంతమాత్రమూ ఇష్టపడలేదు. ఫలితంగా తన పక్కనున్న ప్రతి ఒక్కరినీ కోల్పోయాడు. చివరకు తాను సైతం నేలకొరిగి మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడి వైపు దుర్యోధనుడు మూడు వేళ్లు చూపిస్తూ ఏదో చెప్పేందుకు యత్నించాడు. దుర్యోధనుడు ఎందుకు మూడు వేళ్లను చూపించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. దుర్యోధనుడు మూడు వేళ్లు చూపించగానే అతని వద్దకు శ్రీకృష్ణుడు వెళ్లాడు. అప్పుడు తను ముడు తప్పులు చేశానని శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు చెప్పాడు. ఆ మూడు తప్పుల కారణంగానే యుద్ధంలో ఓటమి పాలయ్యానని తెలిపాడు. ఆ మూడు తప్పులే తనను మృత్యు ఒడికి చేర్చాయని సైతం వెల్లడించాడు. ఆ మూడు తప్పులే చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు. ఇంతకీ దుర్యోధనుడు చేసిన మూడు తప్పులేంటి? మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version