Site icon Bhakthi TV

సరస్వతి మంత్ర జపం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?

సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం.. మనసు ఏకాగ్రతతో ఉండాలని, మాటలో మాధుర్యం రావాలని, చదువులో విజయం సాధించాలని కోరుకునే ప్రతి వారు సరస్వతి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. సరస్వతి మంత్ర జపం వల్ల కలిగే ఫలితం ఏంటంటే.. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. కళాకారులకు సృజనాత్మకత, వాక్చాతుర్యం పెరుగుతుంది. అయోమయం, గందరగోళం, అసాంత్వన తొలగిపోతాయి. చదువు, ధ్యానం, సృజనాత్మకతకు పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది.

సరస్వతి మంత్రాన్ని ఎప్పుడు వినాలి?

సరస్వతి మంత్ర జపం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు సరస్వతి మంత్రాన్ని ఎప్పుడు వినాలో కూడా తెలుసుకుందాం. పడుకునే ముందు..

ధ్యానం చేసే సమయాల్లో.. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు.. ఉపాధ్యాయులు, పండితులు, కళాకారులు తమ ప్రతిభ పెంపొందించుకోవడానికి సరస్వతి మంత్రాన్ని వినాలి. అలాగే ప్రతిరోజూ శ్రద్ధతో, క్రమబద్ధంగా ఈ మంత్రాన్ని జపిస్తే సరస్వతి అమ్మవారి కటాక్షం నిరంతరం లభిస్తుంది. ప్రతిరోజూ పఠనం ద్వారా శరీరానికి శాంతి, మనసుకు స్పష్టత, ఆత్మకు వెలుగు కలుగుతాయి. ఇది కేవలం విద్యలోనే కాదు, జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని ప్రసాదించే దివ్య సాధన. జ్ఞానం అనేది సంపదల్లో శ్రేష్ఠమైనది; భక్తిశ్రద్ధలతో మంత్ర జపం చేస్తే సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షమే ఆ సంపదను ప్రసాదిస్తుంది.

Share this post with your friends
Exit mobile version