Site icon Bhakthi TV

‘అష్ట కష్టాలు’ అంటే ఏమిటి?

అష్ట కష్టాలు పడుతున్నాం అని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటారు. అసలు అష్ట కష్టాలు అంటే ఏమిటి? ముందుగా తెలుసుకుందాం. అష్ట అంటే ఎనిమిది.. ఇక కష్టాల గురించి తెలిసిందే. మనిషి పడే ఎనిమిది ముఖ్యమైన కష్టాలన్నమాట. అంతకు మించిన కష్టాలు మరొకటి ఉండవని అర్థం.

‘అష్ట కష్టాలు’ అంటే ఏమిటి?‘అష్ట కష్టాలు’ అంటే ఏమిటి?

అష్ట కష్టాలు:
1. దాస్యం: ఇతరుల కింద బానిసగా బతకడం.
2. దారిద్ర్యం: తిండికి, బట్టకు లేని పేదరికం.
3. రోగం: తీరని వ్యాధులతో బాధపడటం.
4. అప్పు: తీర్చలేనంత అప్పుల్లో మునిగిపోవడం.
5. అజ్ఞానం: చదువు లేదా విచక్షణ లేకపోవడం.
6. అపవాదు: లేని నిందలు పడటం.
7. వియోగం: ఇష్టమైన వారు శాశ్వతంగా దూరమవ్వడం.
8. భయం: నిరంతరం ఏదో ఒక ఆందోళనతో బతకడం.
ఈ అష్ట కష్టాల నుంచి రక్షించేది ఏమిటంటే.. ధ్యానం/జపం అని పేర్కొంటారు.

Share this post with your friends
Exit mobile version