
భగవద్గీతలో ఏం చదివితే ఏం జరగుతుందో తెలుసుకుందాం.
10. విభూతి యోగం: ఈ అధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది. (మహా ఐశ్వర్యం లభిస్తుంది)
11. విశ్వరూప సందర్శనయోగం: ఈ అధ్యాయం నిష్టగా పఠించడంవలన భూత, ప్రేత పీడలు తొలగుతాయి.
12. భక్తియోగం: ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞానదృష్టి కలుగుతుంది. (ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది)
13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం: ఈ అధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది. (కోరిన ఫలము లభిస్తుంది)
14. గుణత్రయ విభాగయోగం: ఈ అధ్యాయం చదివితే వ్యభిచిరదోషం,స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి. (మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)
15. పురుషోత్తము యోగం: ఈ అధ్యాయాన్ని భోజనంచేసేముందు పఠించాలి. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షంసిద్ధిస్తుంది. (మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)
16. దైవాసుర సంపద్విభాగయోగం: ఈ అధ్యాయం చదివినచో చదివినవారితోపాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. (రాజాధిరాజులా వెలిగిపోతారు)
17. శ్రద్ధాత్రయ విభాగయోగం : తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆధ్యాయాన్ని పఠిస్తే మంచిది. సత్వరం ఫలితం కనిపిస్తుంది. (అనేక వ్యాధులు దూరం అవుతాయి)
18. మోక్ష సన్యాసయోగం: నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి. అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనంద్వారా లభిస్తుంది. (దాన, ధర్మ, యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది).
