Site icon Bhakthi TV

శ్రీరాముడి కోసం తిరుగుతూ స్పృహతప్పిన తులసీదాస్.. అప్పుడేం జరిగిందంటే..

తులసీదాసే గత జన్మలో వాల్మీకి మహర్షి అని తెలుసుకున్నాం కదా. ఆయన రామచరిత మానస్ సంకీర్తన చేస్తుంటే హనుమంతుల వారు వచ్చి తన్మయత్వంతో వినేవారట. అయితే ఒకానొక సమయంలో తులసీదాస్‌ను హనుమంతుల వారే రక్షించారని చెబుతారు. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. వారణాసిలో భైరవనాథుడు అనే తాంత్రికుడుండేవాడు. అతను రామచరిత మానస్ తాళపత్రాలు దొంగతనం చేసి తెమ్మని ఇద్దరు దొంగలను పంపాడట. ఇద్దరు యువకులు వారిని బాణాలతో కొట్టారట. దీంతో వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆ ఇద్దరు దొంగలు తులసీదాస్‌కు విషయాన్ని చెప్పారట.

ఆ కుర్రవాళ్లు ఎవరో తులసీదాస్‌కు అర్థమైంది. ఆయన రాములవారి దర్శనం కోసం తపిస్తూ కొండలు వెంట తిరుగుతూ ఒకచోట స్పృహ తప్పి పడిపోతుంటే.. హనుమంతుల వారు స్వయంగా తులసీదాసును పట్టుకున్నారట. ఆంజనేయుడు తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో తులసీదాసు నోటివెంట అప్రయత్నంగా హనుమాన్ సంకటహర మోచన స్తోత్రం.. వచ్చిందట. అంతేకాదు.. ఆ తరువాత కాలంలో శ్రీరాముడిని కూడా కన్నులారా వీక్షించారట. మనం వాల్మీకి రాసిన రామాయణం చదువుతాం.. కానీ ఉత్తరాది వారు మాత్రం తులసీదాస్ రాసిన రామచరిత మానసమును నిత్యం పారాయణ చేస్తారు.

Share this post with your friends
Exit mobile version