
ధనపాలుడు గురించి తులసీదాసు చెప్పిన కథ వాస్తవంగా జరిగినదేనట. కాశీలో జరిగిందని కూడా ముందుగానే చెప్పుకున్నాం కదా. మనసులో కూడా ధనపాలుడు నిష్టగా శ్రీరామ చంద్రుని పూజించుకోలేదు. మానస పూజ అయినా కూడా కొంచెం పంచదార ఎక్కువ పడినా సహించలేకపోయాడు. రామయ్య కర స్పర్శతో వైరాగ్యంతో చివరికి ధనపాలుడు తపో భూమికి వెళ్లిపోయాడు. మానసిక పూజను సైతం రామయ్య స్వీకరించాడు కాబట్టి రాముడు తనకు ఎవరు, ఎలా పూజించినా తీసుకుంటాడని అర్థమవుతోంది.
నిజమైన భక్తికి ఆర్భాటాలు అవసరం లేదని ఈ కథ చెబుతోంది. దేవుడు ఉన్నాడని నమ్మి నిష్టగా పూజ చేస్తే చాలు.. శ్రీరామచంద్రుడు స్వీకరిస్తాడు. పూజలో భక్తి, విశ్వాసాలు మాత్రమే ఉండాలి. బంగారు పూలతో పూజించినా కూడా భక్తి లేనిదే దానిని శ్రీరాముడు స్వీకరించడని ఈ కథ ద్వారా తెలుస్తోంది. పరమ లోభి అయిన ధనపాలుడు చేసేది మానస పూజ అయినా కూడా నిజంగా పూజిస్తున్నట్టుగా భావించాడు. కాబట్టే పాలల్లో ఎక్కువ పడిన పంచదారన తీసేందుకు యత్నించాడు. అందుకే అతడిని నిజమైన భక్తుడిగా భావించి రామయ్య అతని పూజను స్వీకరించాడు. అతనికి కర స్పర్శను అందించి భక్తితో పాటు వైరాగ్యాన్ని ప్రసాదించాడు.
