Site icon Bhakthi TV

మధ్వాచార్యుల వారు ఎవరి అవతారమని చెబుతారంటే..

మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు. జగత్తు మాయ మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వంతంత్రుడు, జీవోత్తముడు ఆచార్యుడు, ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యం. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.

మధ్వాచార్యుడు, హనుమంతుడు, భీముడు అలాగే వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం రాశాడు. తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు.

Share this post with your friends
Exit mobile version