Site icon Bhakthi TV

టోపి అమ్మ టీకప్పు వెనుక ఉన్న రహస్యమేంటంటే..

అరుణాచలంలో పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం రూపంలో పరమేశ్వరుడు కొలువుదీరాడు. ఇక్కడికి వెళ్లిన వారు టోపి అమ్మ దర్శనం కోసం కూడా ఎదురు చూస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఈమె దర్శనమిస్తూ ఉంటుందట. కన్యాకుమారికి చెందిన పళిని అరుణాచలానికి వచ్చి స్థిరపడింది. టోపీ పెట్టుకుని ఉండటంతో అంతా ఈమెను టోపీ అమ్మగా పిలుస్తారు. చూడటానికి మురికి బట్టలు, తలపై టోపీ, చెదిరిన జుట్టుతో కనిపించే ఈమె దర్శనమిస్తుంది. ఈమెను చూసిన వారిలో కొందరు.. మతి స్థిమితం లేని వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. మరికొంత మంది మాత్రం, శివయ్య అనుగ్రహం పొందిన అవధూతగా, తపస్సిగా, భావిస్తారు.

టోపి అమ్మ టీకప్పు వెనుక ఉన్న రహస్యమేంటంటే..

అయితే టోపీ అమ్మ దర్శన భాగ్యం కలగాలని కూడా ఎంత మంది ఆరాట పడుతుంటారో.. తాగిన టీకప్పు కోసం కూడా అంతే మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం, మణిమారన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో చాలా బాధపడుతుండేవాడట. ఒకసారి అతనికి టోపీ అమ్మ స్పర్శ తనకు తగలడంతో ఆ సమస్య తొలిగిపోయిందట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలియడంతో టోపీ అమ్మకు చాలా గుర్తింపు లభించింది. అంతే కాకుండా ఆమె ఉమ్మి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయని కూడా కొందరు చెబుతారు. అలా మంచి ప్రఖ్యాతి సంపాదించుకున్న ఈ టోపి అమ్మ దర్శన భాగ్యం కలగాలని చాలా మంది అరుణాచలంలో ఎదురుచూస్తుంటారు.

Share this post with your friends
Exit mobile version