Site icon Bhakthi TV

సీతమ్మ జాడ కోసం వెళుతున్న వానరులకు వినతుడు చెప్పిన వివరాలేంటంటే..

రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నలుదిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణకాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయించుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లో లాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా సుగ్రీవుడు భూగోళ వివరాలను ఎలా అనేది ఆసక్తికరం.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:

ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;

నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ, అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ ఉంటాయి) తరువాత శిశిరము అను పర్వతము అనంతరం సముద్రము (అండమాన్ సముద్రం)

యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.

తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సముద్రం) అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి) తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్) ఋషభము అని పర్వతము మధుర జలధి (జపనీస్ సి )

ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా) 13 యోజనాల దూరంలో బంగారు పర్వతము – జాత రూప శిలము ఉదయాద్రి (ల్యాండ్ ఆఫ్ రైసింగ్ సన్)(జపాన్ ) తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్) అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒక్కసారి గూగుల్ మ్యాప్ పరిశీలిస్తే ఇవన్నీ కనిపిస్తాయి.

Share this post with your friends
Exit mobile version