Site icon Bhakthi TV

Special Features Of Kumbakonam Sweta Vinayaka temple : కుంభకోణం శ్వేత వినాయకుడి ఆలయ విశేషాలేంటంటే..

కుంభోణంలోని శ్వేత వినాయకర్ ఆలయం గురించి ఇప్పటికే చాలా విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయ విశేషాలతో పాటు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. శ్వేత వినాయకర్ ఆలయ సముదాయం సుమారు 7.25 ఎకరాల్లో విస్తరించి ఉంది. తూర్పు ముఖంగా ఐదు అంతస్తుల గోపురంలో, 5 మండపాలతో ఇక్కడ ఆలయం చూడముచ్చటగా ఉంటుంది. 6 అడుగుల ఎత్తులో నాలుగు రాతి స్తంభాలు శ్వేత వినాయకుడి ముందు ఉంటాయి. ఇక్కడ శివపార్వతులు కొలువుదీరారని చెప్పుకున్నాం కదా. వారితో పాటు అష్ట భుజాలతో మహాకాళి లేదంటే కాళి మాత కొలువుదీరి ఉంది.

Special Features Of Kumbakonam Sweta Vinayaka temple : కుంభకోణం శ్వేత వినాయకుడి ఆలయ విశేషాలేంటంటే..

ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడని చెప్పుకున్నాం కదా. ఆలయ ప్రాంగణంలో కూడా చాలా శివలింగాలు దర్శనమిస్తాయి. వీటన్నింటిని దుర్వాస మహర్షి నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్న ఋషులు ప్రతిష్ఠించారని చెబుతారు. శ్వేత వినాయకుడు కొలువైన గర్భగుడి పక్కనే 24 సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు కలిగిన మండపం ఉంటుంది. దీనిని గాయత్రి మండపం అంటారు. గాయత్రీ మంత్రంలో ఒక్కో అక్షరాన్ని ఒక్కో స్తంభం సూచిస్తుందట. కమలాంబల, బుద్ధి దేవిని వినాయకుడు ఇక్కడే వివాహం చేసుకున్నాడని చెబుతారు. అందువల్లే వివాహంలో సమస్యలున్నవారు ఇక్కడి వినాయకుడిని పూజిస్తే అడ్డంకులన్నీ తొలగి వివాహం అవుతుందట.

Share this post with your friends
Exit mobile version