Site icon Bhakthi TV

భూమి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడని కొన్ని పవిత్ర వస్తువులేంటంటే..

శాస్త్రోక్తంగా పూజా సామగ్రిని భక్తి–గౌరవాలతో చూడాలి. మనం అలాగే చూస్తూ ఉంటాం కూడా. వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తాం. కానీ పొరపాటునో గ్రహపాటునో కొన్ని వస్తువులను నేల మీద పెడుతూ ఉంటాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద పెట్టకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారము (స్వర్ణం)
జపమాల
దీపము
కర్పూరము
సాలగ్రామము
తమలపాకులు
నైవేద్యము (దేవునికి నివేదించే ప్రసాదం)
పువ్వులు
పూజాద్రవ్యములు
చందనము
పుస్తకములు (పురాణ, శాస్త్ర గ్రంథములు)
శివలింగము
నవరత్నములు
తులసి
యజ్ఞోపవీతము
శంఖము
గంట

ఈ వస్తువులు భూమిమీద ఉంచితే వాటి పవిత్రత, శుద్ధి, శక్తి తగ్గుతాయని శాస్త్రోక్త నమ్మకం. కాబట్టి వీటిని ఎప్పుడూ పవిత్ర పీట మీద, శుభ్రమైన వస్త్రంపై లేదా పూజా స్థలంలో మాత్రమే ఉంచాలి.

Share this post with your friends
Exit mobile version