శారదాదేవి జీవితంలో జరిగిన మరో ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం. అప్పుడు ఆమెకు 13 సంవత్సరాల వయసట. ఈ ఘటన రామకృష్ణ పరమహంస గ్రామం కామార్పుకూర్‌లో జరిగింది. శారదాదేవికి పెద్దలు.. తమ గ్రామంలోని హలధర పుష్కరిణి అనే చెరువులో స్నానం చేయడానికి తెల్లవారుజామున వెళ్లమని సూచించారట. తెల్లవారుజామున అంటే అప్పటికి ఇంకా తెల్లవారలేదట. పైగా తెలియని ఊరిలో ఒంటరిగా వెళ్ళడానికి శారదాదేవి ఆందోళన చెందుతోందట. అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళుతోందట.
అప్పుడు ఒక్కసారిగా శారదా దేవి ముందు నలుగురు, వెనక నలుగురు గొప్ప స్త్రీలు కనిపించారట. వారు తాము కూడా హలధర పుష్కరిణికి స్నానానికి వెళ్తున్నామని చెప్పారట. శారదాదేవిని జాగ్రత్తగా తమతో పాటు తీసుకువెళ్లారు. వారి పాద మంజీర ధ్వనులను వింటూ శారదాదేవి తన స్నానాన్ని ముగించిందట. తిరిగి ఆమెను తన ఇంటి ముందు ఆ ఎనిమిది మంది స్త్రీలు దిగబెట్టి వెళ్లారట. ఆ ఎనిమిది మందిని అష్టలక్ష్ములుగా చెబుతారు. అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు ఏ చిన్న బెంగ కలిగినా కూడా అలా అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటారని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి.
