Site icon Bhakthi TV

శివుడిని మెప్పించడం కోసం విష్ణుమూర్తి తన కంటినే సమర్పించాడట..

సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారో తెలుసుకున్నాం కదా.. అసలు ఆ సుదర్శన చక్రం చేయడం వెనుక పెద్ద కథే నడించింది. శివయ్య విష్ణుమూర్తిని పరీక్షించాడు. ఒక పువ్వును మాయం చేశాడు. దాని వెనుక కథేంటో తెలుసుకుందాం. సృష్టిలో రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు సకల దేవతలు విష్ణువు వద్దకు వెళ్లారని తెలుసుకున్నాం కదా. విష్ణువుకు దివ్యాయుధం అవసరమైతే శివుడిని పూజించాడని కూడా తెలుసుకున్నాం. విష్ణుమూర్తి ఆయుధం కోసం పెద్ద తపస్సే చేశాడు.

రాక్షస సంహారం కోసం తనకు ఆయుధం అవరసమై విష్ణుమూర్తి కైలాసానికి వెళ్లి శివుడిని ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి పేర్లతో స్తుతించాడట. అలా స్తుతిస్తూ ప్రతి పేరుకి ఒక తామర పువ్వు చొప్పున శివయ్యకు సమర్పించడం మొదలు పెట్టాడు. అప్పుడు శివుడు.. విష్ణుమూర్తిని పరీక్షించాలని అనుకున్నాడట. వెయ్యి తామర పువ్వులలో ఒకదాన్ని దాచాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ పువ్వు స్థానంలో తన కన్నును శివుడికి సమర్పించాడట. దీంతో పరమేశ్వరుడు సంతోషించి తాను స్వయంగా తయారు చేసిన సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి సమర్పించాడు. అప్పటి నుంచి శ్రీహరి చేతిలో ఎప్పుడు మనకు సుదర్శన చక్రం కనిపిస్తుంది.

Share this post with your friends
Exit mobile version