Site icon Bhakthi TV

‘పండగ పూట పాత మొగుడేనా?’.. అసలీ సామెత కరెక్టేనా?

పండగ పూట పాత మొగుడేనా.. అనే సామెత…! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా… ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా…? అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా…? ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క గుణనమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపటం జరుగుతున్నది. మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే.. ‘‘పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేలా వుంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత ఉండటం బాధాకరం.
నిజంగా ఈ సామెత ఇలానే ఉందా? అంటే ఉంది.. కానీ సామెత కాలక్రమంలో మారిపోయింది. అసలు సామెత ఏంటంటే.. ‘పండగ పూట పాత మడుగేనా..’

ఈ పురాతన సామెత అర్థమేంటంటే.. మడుగు అంటే వస్త్రం అని అర్థం.. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది… పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలని. అప్పటి ప్రజల స్థితిగతులు (ఆర్థిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది. కాలక్రమంలో అది కాస్తా పండుగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టుగా మారిపోయింది. తెలియక ముందు అంటే ఏమో కానీ ఇప్పుడు తెలిసింది కదా.. ఇక మీదట అసలైన సామెతనే తెలుసుకుందాం. మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను ఇక మీదట మరచిపోదాం.

Share this post with your friends
Exit mobile version