నిద్రించేటప్పుడు ఏ దిక్కుకు తలపెట్టి పడుకోవాలనే సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దాదాపుగా హిందువులందరికీ ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకోకూడదనే నియమం గురించి తెలుసు. దానికి కారణంగా ఒక కథ చెబుతారు. అలాగే ఉత్తర దిక్కును కుబేర స్థానంగా కూడా పేర్కొంటారు. అందుకే ఆ దిక్కుగా తలపెట్టుకోవద్దని అంటారు. ఇక దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. భూమి, మానవ శరీరాల అయస్కాంత క్షేత్రాల మధ్య ఘర్షణ వల్ల ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని సైన్స్ చెబుతోంది.
ఉత్తర దిశగా తల పెట్టి పడుకుంటే భూ అయస్కాంత శక్తికి, మన మెదడులోని అయస్కాంత శక్తికి ఆకర్షణ ఏర్పుడుతుందట. తద్వారా మెదడుకు రక్త ప్రసరణ తగ్గి, నిద్రలేమి, తలనొప్పి, మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఇక నిద్రించేటప్పుడు దక్షిణ దిక్కుకు తల పెట్టి పడుకోవడం శ్రేయస్కరమని చెబుతారు. దక్షిణ దిక్కును యముడి స్థానంగా పేర్కొంటారు. ఒకవేళ దక్షిణం వైపునకు సాధ్యపడకుంటే తూర్పు వైపు తలపెట్టి పడుకోవాలి. ఇలా చేయడం వలన ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అలాగే ఆరోగ్య సమస్యల వంటివి దరి చేరవని వాస్తు, సైన్స్ రెండూ చెబుతున్నాయి.
