Site icon Bhakthi TV

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటారు కదా.. అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

ఏదైనా పూజలో సంకల్పం చెప్పేటప్పుడు ఆ మంత్రంలో వచ్చే పదాలు ‘జంబుద్వీపే భరతవర్షే భరతఖండే’.. వీటిని మనం నిత్యం వింటూనే ఉంటాం. మన హిందూ ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష 6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకూ వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.
ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

Share this post with your friends
Exit mobile version