Site icon Bhakthi TV

మారేడు చెట్టు వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..

బిల్వపత్రం లేని శివపూజ ఎప్పటికీ సంపూర్ణం కాదు. మారేడు దళం సమర్పిస్తే శివుడు అత్యంత సంతోషభరితుడవుతాడట. మారేడు దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. మారేడు చెట్టును సైతం శివుని స్వరూపంగా చెబుతారు. అయితే శివుడు, మారేడు వృక్షం రెండూ ఒకటేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనట.. దేవతలు సైతం మారేడు చెట్టును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారట. మారేడును ఇంట పెంచుకున్న కూడా చాలా మంచిదట. బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

మహాశివరాత్రి పర్వదినం రోజు తెలిసో తెలియకో శివలింగం మీద మారేడు దళాన్ని వేస్తే గత జన్మల పాపాలు సైతం నశిస్తాయట. మారేడు మహిమ గురించి శివ పురాణంలో వివరించడం జరిగింది. మారేడు చెట్టు వేళ్ళలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలన్నీ ఉంటాయని చెబుతారు. మారేడుచెట్టు మూలంలో శివలింగాన్ని ఉంచి పూజ చేస్తే ఊహించని ఫలితం ఉంటుందట. శాశ్వత శివుని సన్నిధి లభిస్తుందట. మారేడు చెట్టు కింద స్నానమాచరిస్తే ఏం జరుగుతుందంటే.. సమస్త పుణ్య తీర్థాలలో స్నానం చేసినట్టేనట. మారేడు చెట్టు మొదలును గంధ పుష్పాదులతో పూజిస్తే శాశ్వత శివలోకం ప్రాప్తిస్తుందట.

Share this post with your friends
Exit mobile version