Site icon Bhakthi TV

ఈ శ్రావణ శనివారానికి ఎన్ని ప్రత్యేకతలంటే..

తెలుగు పంచాంగం ప్రకారం అన్ని మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. ఆధ్యాత్మికపరంగానూ ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలోని అన్ని రోజులలోనూ శివారాధన చేయడానికి అత్యంత శ్రేష్టమైనది. శుక్ర, మంగళవారాలు మాత్రం అమ్మవారి ఆరాధనకు శ్రేష్టమైనవి. ఇక ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణ శనివారం నాడు రాఖీ పౌర్ణమి కలిసి రావడమే కాదు.. నేడు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మదినం. ఈ రోజున చేసే కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం వలన శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ మాసం శ్రీమన్నారాయణుడికి సైతం శ్రేష్టమే. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొన్ని పరిహారాలు చేస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని వ్యాసుని భవిష్య పురాణం చెబుతోంది. ప్రతి ఒక్క రాశి వారిని ఏదో ఒక సమయంలో శని బాధలు వెంటాడుతాయి. కాబట్టి అలాంటి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే జీవితంలో సుఖ శాంతులు నెలకొంటాయని నమ్మకం.

జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్న వారు, శని మహర్దశ నడుస్తున్నవారు, ఇంకా శని అధిపతి అయిన మకర, కుంభ రాశుల వారు ఈ రోజున పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version