Site icon Bhakthi TV

కన్నయ్య విగ్రహంపై చెత్త వేస్తోందని భావించి గోవిందమ్మకు జైలు శిక్ష..

కృష్ణార్పణం అనే పదం మహత్యం గురించి తెలుసుకుంటున్నాం. గోవిందమ్మ ద్వారక సమీపంలోని గొల్లపల్లెలో నివసించేది. ఆమె కృష్ణార్పణం అనడం మొదలు పెట్టిన నాటి నుంచి ఆ ఊరిలోని శ్రీకృష్ణుడి ఆలయంలోని కన్నయ్య విగ్రహంపై గోమయం, చెత్త పడుతుండేవని తెలుసుకున్నాం కదా. ఆలయ పూజారి శుభ్రం చేసినా ఆ తంతు కొనసాగుతూనే ఉండేది. ఇది ఎలా జరుగుతోందో తెలియక ఊరిలోని వారంతా నిఘా పెట్టారు. గోవిందమ్మ చెత్త ఊడ్చి పారేసిన వెంటనే.. అక్కడ కన్నయ్యపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడాన్ని గ్రామస్తులు గమనించారు.

ఇదంతా గోవిందమ్మ పనేనని ఊరిలోని వారంతా భావించి కోపంతో రగిలిపోయారు. గోవిందమ్మ తనకేం తెలియదని ఎంత చెబుతున్నా గ్రామస్తులు వినకుండా ఆమెను అక్కడి రాజుగారి దగ్గరకు తీసుకునిపోయారు. ఆమెకు రాజుగారు కారాగార శిక్ష విధించారు. గమనించి ఊరందరూ గోవిందమ్మను దోషిగా భావించి ఆమె చేసిన దానికి ఆగ్రహంతో, ఆమెను ఆ దేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా విని గోవిందమ్మ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా ఆమెకు కారాగార శిక్ష విధించారు. గోవిందమ్మ కారాగారంలోకి వెళుతూ కూడా కృష్ణార్పణం అనేసింది. మరుసటి రోజు గ్రామంలో ఊహించని ఘటన జరిగింది. అదేంటో మరో కథలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version