శ్లో𝕝𝕝 యత్ర దృష్టిర్గతా తత్ర
న గన్తవ్యం తతో మనః |
గచ్ఛత్స్వపి మనో తత్ర
నరో గచ్చేత్కదాపి న ||
చూపు నిలచిన ప్రతి చోటుకి మనసు వెళ్లరాదు…. మనసు అచ్చటికి వెళ్లిననూ మనిషి వెళ్లరాదు. అనగా ఆకర్షణ అనేది మనస్సుని పెడదారి పట్టడానికి కారణమైతుంది. కావునా ఆ సమయంలో మనసుని నియత్రించుకోవాలి. ఈ చూపు ద్వారా ఏర్పడిన ఆకర్షణ, ఆకర్షణ ద్వారా లొంగిపోయిన మనస్సుని నియత్రించుకోలేని మానవుడు కనీసం ఆ ప్రదేశానికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. లేనిచో అతడికి అవమానం, భంగపాటు తప్పవు అని అర్థం.
