Site icon Bhakthi TV

గాంధారి శాపం శ్రీకృష్ణుడిపై పని చేసిందా?

శ్రీకృష్ణుడిని గాంధారి 36 ఏళ్ల తరువాత నీ వంశం కూడా నశిస్తుందని శపించింది. అయితే దీనికి ముందు పాండవుల విషయంగా గాంధారిని వేదవ్యాసుడు అనునయించాడు. “నీవే దుర్యోధనుడు యుద్ధ విజయార్థియై నీ ఆశీర్వాదం పొందగోరి వచ్చి, నీకు మొక్కినపుడు.. ‘యతో ధర్మః తతో జయః’ అన్నావు గదా! నీ బిడ్డలు మీ మాట వినకుండా ఎప్పుడూ తమకు ఏ అపకారమూ తలపెట్టని సోదరులైన పాండవులను బాధించి తమ దుర్గతికి తామే కారణమైనారు. నీ మాట ప్రకారం చూచినా, పాండవుల వైపే ధర్మమున్నట్టు గదా!” అని నచ్చజెప్పాడట. ఇపుడు మళ్ళీ ఆమె కృష్ణుణ్ణి శపించబోయింది!

గాంధారి శాపం శ్రీకృష్ణుడిపై పని చేసిందా?

శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ “నీవు చేయ వలసినది చేయక, నీ బిడ్డలను అదుపులో పెట్టుకొనక నన్ను ఆడిపోసుకున్నావు. మాకెట్లాగూ ఋషుల శాపముంది. అది జరిగి తీరుతుంది. నీ పాతివ్రత్య ఫలమూ, నీ తపస్సుల ఫలమూ ఎందుకు వ్యర్థం చేసుకుంటావు ? ఇందువల్ల నీకేమి వచ్చింది!” అన్నాడు. కోపము తపమును జెరచును… క్రోధిగాన్ తపస్వికి జన్నే? అంటుంది భారతం. మా యాదవులను ఒకరు చంపలేరు. కాబట్టి వాళ్లే ఒకరినొకరు చంపుకోక తప్పదు అన్నాడు శ్రీకృష్ణుడు. పోనీ! ఆ విధంగానైనా ఆమె దుఃఖ భారం తగ్గిందిలే అనుకుంటాడు ఆయన. ఆ శాపం ఆయన మీద ఏమీ పని చేయలేదు.

Share this post with your friends
Exit mobile version