Site icon Bhakthi TV

దేవకి-యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూసి మహర్షులేం చెప్పారంటే..

శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెల 16న రానుంది. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడికి సంబంధించి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం. దుష్టశిక్షణ శిష్ఠరక్షణకు యుగయుగానా జన్మిస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణుని గురించి ఆయన చెప్పిన మాటలు గురించి ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంత పరిపక్వత పొందుతుంది. అలాంటి శ్రీకృష్ణుడి నామకరణం ఎలా జరిగిందంటే… ఒకనాడు దేవకి, తన భవనంలోని, మేడ మీద గది ముందరున్న విశాల ప్రదేశంలో నిల్చుంది. యథాలాపంగా ప్రకృతిని పరవశించి చూసే ఆమె ఆకాశాన్ని చూసింది. నీలాకాశం, కదిలే మబ్బులపై కళ్ళు పడ్డాయి. ఇలాగే వుంటాడు నా పిల్లాడనుకుంది. అలాగే చూస్తూ నిల్చుంది.

వినీలాకాశంలో మబ్బులు చెల్లాచెదురయ్యే వరకు పిచ్చిదానిలా చూస్తూ నిలబడింది. ఆ మబ్బులు తమాషాగా ఓ పిల్లవాని ఆకారంగా కనబడటంతో మరింత ఆశ్చర్యపోయింది. ఆ ఆకారంలో దేవకి… కాళ్ళు, చేతులు మరచిపోలేని కళ్ళు, ముఖం, స్పష్టంగా చూసింది. ఆ మేఘశ్యాముని తలచుకుని మురిసిపోయింది.

ఆ సమయంలో గర్గాచార్యులవారు, వసుదేవుడు అక్కడికి వచ్చారు. ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు. కులగురువులు, దేవకి-యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూశారు. మహర్షులు, పండితుల సూచన ప్రకారం ఆ పిల్లవాని పేరు, “క”, “చ”, “ఘ” లతో ప్రారంభమవ్వాలి. తమాషాగా దేవకి వూహించుకున్న వూహల “ఘనశ్యాముడే” ఆ పిల్లవాడి పేరయింది.

Share this post with your friends
Exit mobile version