Site icon Bhakthi TV

అమావాస్యకు, పితృదేవతలకు ఉన్న సంబంధం ఏమిటంటే..

ఒకరోజు పితృదేవతలు తమ మానస పుత్రిక అచ్చోద. ఆమె నది రూపంలో ఉండేది. ఒకసారి పితృదేవతలు తమ పుత్రిక అయిన అచ్చోద వద్దకు వచ్చి ఏదైనా వరం కోరుకోమనగా… ఆమె వరం కోరుకోవడంలో పొరపాటు చేసిందట. దీంతో అప్పటి వరకూ ఆమె సంపాదించిన యోగ శక్తినంతా కోల్పోయిందట. అందుకే తమ కుమార్తె ధర్మాన్ని తప్పినందుకు ఆమె దివ్యత్వాన్ని కోల్పోతుందని శపించారని మత్స్య పురాణం చెబుతోంది. ఆ విధంగా ఆమె ‘మావాస్య’ కాలేకపోయిందట. ‘మావాస్య’ అంటే మావసుడికి ప్రియురాలు కాలేకపోయిందని అర్థం. అప్పటి నుంచి అచ్చోదను అమావాస్య అని పిలవడం ప్రారంభించారట.

అమావాస్యకు, పితృదేవతలకు ఉన్న సంబంధం ఏమిటంటే..

అలా అమావాస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అని అర్ధం. ఆమె పేరిటే కాలాంతరంలో అమావాస్య తిథి ఏర్పడింది. అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణమని చెబుతారు. అందుకే తమ మానస పుత్రిక పేరు మీదుగా వచ్చే ‘అచ్చోద అమావాస్య’ తిథి రోజున ఎవరైనా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే వారికి అనంత పుణ్యఫలాన్ని పితృదేవతలు అందిస్తుంటారట. ఇదే అమావాస్యకు పితృదేవతలకు ఉన్న సంబంధం. అమావాస్య రోజున ఏ సమయంలో పితృదేవతలకు శ్రార్ధకర్మలు, తర్పణాలు వదలాలంటే.. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో చేయాలని చెబుతారు. ఎలాంటి శ్రాద్ధ కర్మలు నిర్వహించలేకపోయినా కనీసం ఒక బ్రాహ్మణునికి అన్నదానం చేసినా పితృదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version