అయోధ్య రామాలయ సముదాయంలో మరో అద్భుతం చోటుచేసుకోబోతోంది. బంగారం, వజ్రాలు, పచ్చలు తదితర విలువైన రాళ్లతో రూపొందించిన కర్ణాటక శైలిలోని శ్రీరాముడి విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నారు. సుమారు 5 క్వింటాళ్ల బరువు, 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం విలువ సుమారు 30 కోట్ల రూపాయలుగా అంచనా. కర్ణాటకకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు ఈ విగ్రహాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. 1,750 కిలోమీటర్ల దూరం నుంచి ఇండియన్ పోస్ట్‌లో ప్రత్యేక వ్యాన్ ద్వారా అయోధ్యకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అంగద్ తిలా సమీపంలో దీనిని ప్రతిష్టించాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఉడిపి స్వామి నిర్ణయం తరువాతనే విగ్రహం ప్రతిష్టపై ప్రకటన వెలువడుతుందని అయోధ్య రామాలయం ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.
₹30 crore Karnataka-style jewel-studded Ram idol : అయోధ్యలో 30 కోట్ల విలువైన బంగారు రాముడు

₹30 crore Karnataka-style jewel-studded Ram idol

