
అసలు శాస్త్రాలను ఎందుకు అధ్యయనం చేయాలని చెబుతారు. అసలెందుకు అధ్యయనం చేయాలి? వాటి సారాన్ని ఎందుకు గ్రహించాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. నీరు ఎంతటి మలినాన్నైనా శుభ్రం చేస్తుంది. ఎలాంటి వాసన అయినా నీటితో పోతుంది. అలానే శాస్త్రాలు, పురాణములు, కావ్యాలు మొదలైన వాటి అధ్యాయనం ఎంతటి నాస్తికతత్వాన్ని అయినా పోగొట్టి భగవంతుని యందు చెదరని బెదరని విశ్వాసాన్ని ప్రేరేపిస్తాయి.
అజ్ఞానమను చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాయి. దుర్గుణములతో నిండిన మనో బుద్ధులను సుగుణములతో నింపి, భగవంతుని చెంతకు చేరుకొనుటకు మార్గాన్ని సుగమం చేస్తాయి. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యాయనం చేయాలి. వాటి యందలి సారాన్ని గ్రహించి, ఆచరించాలి. తాము ఆచరిస్తూ మరింత మంది ఆచరించేలా ప్రోత్సహించాలి. తద్వారా అందరూ తరించాలి. మోక్షమును వరించాలని చెబుతారు.
