Site icon Bhakthi TV

Why Idol Worship : భగవంతుడు అన్నింటా ఉన్నాడు.. మరి విగ్రహారాధన ఎందుకు?

ఒకసారి వివేకానందుడు ఇప్పటి రాజస్తాన్‌లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు. విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో “నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసుకుంటున్నారు” అన్నాడు. అప్పుడు వివేకానందుడు నవ్వుతూ.. రాజు గారి సహాయకుడిని పిలిచి అక్కడ గోడకి వేలాడుతున్న రాజు చిత్ర పటాన్ని కిందకు దించమన్నారు. అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేశాడు. అప్పుడు స్వామీజీ ఆ పటంపై వుమ్మివేసి తొక్కమని రాజు సహాయకుడిని ఆదేశించారు.

Why Idol Worship

నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు. స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు. రాజు ఆగ్రహోద్రుకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు. చివరికి సహాయకుడు “నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటంలో వున్న చిత్రంలో మా రాజు వున్నారు” అంటూ అరిచాడు. అప్పుడు స్వామీజీ “రాజు నీ ఎదురుగా వ్యక్తిగా కూర్చుని వున్నారు. ఆ పటంలో వున్నది ఒక కాగితం మాత్రమె. అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు.” “కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటున్నావు, తొక్కనంటున్నావు .. ఎందుకంటే నువ్వు ఆ పటంలో నీ రాజుని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటున్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు” అంతేనా అన్నారు. స్వామీజీని చూసిన రాజు… ఆయన ముందర సాష్టాంగ పడ్డాడు,”స్వామి మీరు చెప్పదలుచుకున్నది నాకు పూర్తిగా అర్ధమయిందని” ఆ రాజు చెప్పాడు. ఇదే విగ్రహారాధన సారము.

Share this post with your friends
Exit mobile version