Site icon Bhakthi TV

సాలగ్రామ పూజలో ఆవాహనాది షోడశోపచారాలు ఎందుకు చేయము?

ఇవాళ అంటే బుధవారం భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా దేశమంతా జరుపుకుంటోంది. పితృ పక్షాలలో వచ్చే ఇందిరా ఏకాదశి కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించుకుంటారు. అంతేకాకుండా తమ పితృదేవతలను స్మరించుకుంటూ నదీస్నానమాచరించి.. పిండప్రదానం చేస్తారు. దీనివల్ల పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. అయితే ఇందిరా ఏకాదశి నాడు సాలగ్రామాలు పూజించడం వల్ల జీవితంలో డబ్బుకు కొరత ఉండదని విశ్వాసం.

ఈ సందర్భంగా అసలు సాలగ్రామాలంటే ఏమిటి? వాటిని ఎలా పూజించాలనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. సాలగ్రామం విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషమన్న విషయం అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి ఎలాంటి పరిస్తితుల్లో అయినా సాలగ్రామంలోనే నివాసముంటాడని చెబుతారు. అందువల్లే ఇంట్లో దేవతార్చన చేసినా లేదంటే దేవాయలంలో చేసినా సాలగ్రామము లేకుండా పూజలు నిర్వహించరు. వాస్తవానికి మనం ఏ పూజ చేసుకున్నా కూడా తప్పనిసరిగా ఆవాహనాది షోడశోపచారాలు చేయడమనేది సర్వసాధారణం. కానీ సాలగ్రామాలలో విష్ణుమూర్తి సర్వకాల సర్వావస్థల యందు కొలువై ఉంటాడు కాబట్టి ఆవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

Share this post with your friends
Exit mobile version