Site icon Bhakthi TV

పరమాత్మకు రూపం, నామం ఎందుకు లేవు?

పరమాత్మకు రూపం, నామం లేదు అని ఎందుకు అంటారో తెలుసా? దీనికి కారణముంది. అదేంటంటే.. “యద్రూపం తదనష్టం” అని చెప్పారు. అంటే ఏది రూపముంటే అది పుట్టి, పెరిగి, క్షీణించి చివరకు నశించాలి. కాని పరమాత్మ అజుడు – అంటే ఆయనకు జన్మ లేదు. అచ్యుతుడు – అంటే ఆయనకు మరణం లేదు. అవ్యయుడు – ఆయనకు క్షయం లేదు. అందువల్ల ఆయనకు రూపం లేదు, రూపంలేని వాడికి నామం కూడా ఉండదు. మరి పరమాత్మ అనుభూతి ఎలా.. అంటారా? సృష్టి ఎలా జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

మొదట నిశ్శబ్దం, దాని నుంచి అబ్దం (ఆకాశం), ఆకాశం నుంచి స్పర్శ (వాయువు), వాయువు నుంచి రూపం (అగ్ని), అగ్ని నుంచి రుచి (నీరు), నీటి నుంచి గంధం (భూమి). ఇలా ఈ ఐదు భూతాల నుంచి జగత్తు ఏర్పడింది. ప్రళయం వచ్చినప్పుడు ఇదే తిరిగి లీనమవుతుంది: భూమి – నీటిలో, నీరు – అగ్నిలో, అగ్ని- వాయువులో, వాయువు – ఆకాశంలో, ఆకాశం – మళ్ళీ నిశ్శబ్దంలో. అందువల్ల అవ్యక్త పరమాత్మను అనుభవించడానికి మార్గం మౌనం. “నిశ్శబ్దం పరబ్రహ్మ ఉచ్యతే” అని వేదం చెబుతుంది. కాబట్టి పరమాత్మకు రూపం, నామం లేవని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version