Site icon Bhakthi TV

చాలా సందర్భాల్లో భగవంతుడిని వేడుకున్నా ఎందుకు జరగదు?

ఒక దొంగ దొంగతనానికి పోతూ దేవుడికి “ఓ దేవుడా నేను దొంగతనానికి పోతున్నాను… పోలిసులకి దొరక కుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి” అని మనసారా వేడుకున్నాడు. అయినా కూడా దొంగతనం చేస్తూ దొంగ పోలీసులకి పట్టుబడిపోయాడు. మళ్ళీ ఆ దొంగ మనసులో దేవుడిని “ఓ దేవుడా పోలీసులకి దొరికితే దొరికాను కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి!” వేడుకున్నాడు. కానీ దొంగని లాఠీతో పోలీసులు చితకబాదారు. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని పోనీలే పోలీసులు కొడితే కొట్టారు, శిక్షపడకుండా చేయి’’ అని ప్రాథేయపడ్డాడు.

కానీ దొంగకి ఆరు నెలల జైలు శిక్ష పడింది. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ”ఓ దేవుడా శిక్ష వేస్తే వేసావు కాని జరిమానా విధించకుండా చేయి… అసలే డబ్బులు లేవు… వుంటే దొంగతనం ఎందుకు చేస్తాను…” అని దుఃఖంతో దేవుడిని వేడుకున్నాడు. కానీ జడ్జి దొంగకు పదివేల రూపాయల జరిమానా కూడా విధించాడు. మరి దేవుడ్ని ఇన్ని సార్లు ప్రార్ధించినా జరిగేవి జరిగిపోతున్నాయి. ఒకదాని తరువాత ఒకటి. ఈ మాత్రం దానికి భగవంతుడిని అడుగడుగునా వేడుకున్నా జరిగేది ఎవరూ తప్పించలేరు. దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం వుంటుంది. మనకు అనుకూలంగా అన్నీ కోరుకుంటాము. కానీ విధి దాని ధర్మం అది పాటిస్తుంది. చేసేది మంచి పని అయివుంటే మంచి ఫలితం వచ్చి వుండేది!

చేసేది దొంగతనం!

ఒకరు కష్టపడి సంపాదించిన ధనం బంగారము అయాచితంగా తస్కరించడం.. అనేది ధర్మకార్యం కాదు! వస్తువుల్ని, ధనాన్ని పోగుట్టుకొని ఏడ్చేవారి హృదయ వ్యధ వుంటుంది కదా…!

అందుకే మనం చేస్తున్న పనిని బట్టి మనకు న్యాయం లభిస్తుంది. దేవుడికి అన్నీ తెలుసు. తెలియనిది ఏది లేదు… దేనికి ఏ కర్మ ఫలితం ఇవ్వాలో తెలుసు. మనం ఓపికతో ప్రార్దిస్తాము. సరే అది నిజమే!! కాని ప్రార్ధన వెనుక ఏమి జరిగింది అనేది భగవంతుడికి తెలుసు. చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడుకి మనం చేసే పని తెలియకుండా పోదు!

భగవంతుడి పై భారం వేసి చేసే ప్రతి పనికి కర్మఫలితం వుండదు. కానీ మనం ఆపనిని స్వార్ధంతో కాకుండా నిష్కామంగా ఫలితం ఆశించకుండా చేయాలి. ఫలితం అశించావో మరి దాని కర్మ ఫలితం అనుభవించాలి! లా కర్మఫలితం ఆశించకుండా పనులు భగవంతునికి అర్పిస్తూ చేస్తుంటే అదే యోగి అంటే. దాని కోసం హిమాలయాలకి వెళ్ళనవసరం లేదు. షివలే తపస్సు అవసరం లేదు. మనం ధర్మపనలు చేస్తూ ఫలితం ఆశించకుంటే చాలు…!

Share this post with your friends
Exit mobile version