Site icon Bhakthi TV

కాకులకు ఆహారం పెడితే పితరులు ఎందుకు సంతోషిస్తారు?

కాకభూషుండి కాలానికి, ప్రతి యుగానికి సాక్షి అని చెబుతారు కాబట్టి అందుకు ఆయనంత ప్రత్యేకం. కాకి రూపంలోనూ ఆయన మోక్షాన్ని పొందాడు. కాల నియమాలను దాటి జీవిస్తున్నాడు కాబట్టే పితృ పక్ష సమయంలో కాకులకు ఆహారం పెడితే పితరులు సంతోషిస్తారని చెబుతారు. ఈ విషయాన్ని గరుడ పురాణం కూడా చెబుతోంది. కాకులకు ఇచ్చే ఆహారం నేరుగా పితరులకు చేరుతుందని చెబుతారు. కాకభూషుండి కాకులకు.. పూర్వీకులకు మధ్య వారధిగా పేర్కొంటారు. కాకభూషుండి కాకి రూపంలోని అమరుడైన రుషి.

కాకభూషుండి కాలాలకు, యుగాలకు మాత్రమే కాకుండా పితృలోక రహస్యాలకు సాక్షి అని కూడా పిలుస్తారు. కాకభూషుండి కథ ఓ విషయాన్ని తెలియజేస్తోంది. అదేంటంటే.. భక్తి, జ్ఞానంతో మరణాన్ని సైతం జయించవచ్చని కాకభూషుండి కథ వివరిస్తోంది. ముఖ్యంగా శ్రీరాముడి భక్తిలో నిమిగ్నమైన వ్యక్తి ఏం చేయగడనే సందేశాన్నిసైతం కాకభూషుండి కథ ఇస్తోంది. అదేంటంటే.. కాల చక్రాన్ని సైతం అధిగమించగలడట. కాకభూషుండి పేరు గ్రంథాలలో కాకుండా శాశ్వత ప్రతినిథిగా పేర్కొనడం జరిగింది.

Share this post with your friends
Exit mobile version