Site icon Bhakthi TV

నల్లదారం ఎవరు పడితే వారు ధరించకూడదట.. ఇంతకీ వారెవరంటే..

నల్లదారం ఇప్పుడు ప్రతి ఒక్కరి కాలికి చూస్తూనే ఉన్నాం. చెడు దిష్టి పడకుండా ఉండేందుకు ఇప్పుడు చాలా మంది నల్ల ధారం కట్టుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని నమ్మకం. అయితే దీన్ని అందరూ ధరించకూడదు. ముఖ్యంగా కొన్ని రాశులకు సంబంధించిన వారు దీనిని ధరించకూడదు. నలుపు రంగు శనిదేవుడికి చాలా ఇష్టమట. కాబట్టే కొందరికి మంచి జరుగుతుంది. మరికొందరికి చెడు జరుగుతుంది. ఇక ఏ ఏ రాశుల వారు నలుపు రంగు ధారం ధరించకూడదు? ఎందుకు ధరించకూడదో చూద్దాం.

మేషరాశి: మేషరాశివారిని అంగారకుడు పాలిస్తాడట. నల్లదారం శని, రాహువులకు సంబంధించినది కాబట్టి మేషరాశివారు నల్ల దారం ధరించడం వల్ల ఇబ్బందుల్లో పడతారట.

కర్కాటకం: ఈ రాశివారికి చంద్రుడు అధిపతి. శని, రాహువులకు అస్సలు సరిపడదు కాబట్టి కర్కాటక రాశివారు దీనిని ధరించకూడదట. ఈ రాశివారు నల్లదారం ధరించడం వల్ల చంద్రుని శక్తి బలహీన పడి సమస్యలను తెచ్చిపెడుతుందట.

సింహం: ఈ రాశికి అధిపతి సూర్యుడు.. మూలకం అగ్ని. కాబట్టి ఈ రాశివారు నల్లదారం ధరించకూడదట. వాస్తవానికి సూర్యుడు, శని తండ్రీకొడుకులని అంటారు. కానీ జ్యోతిష్యంలో మాత్రం వీరిని శత్రువులని అంటారు.

వృశ్చికం: ఈ రాశివారికి అంగారకుడు అధిపతి. కాబట్టి అస్సలు నల్లదారం ధరించకూడదట. ఒకవేళ ధరిస్తే నెగిటివిటీతో పాటు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయట.

Share this post with your friends
Exit mobile version