Site icon Bhakthi TV

Where is Indraprastha : పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం ఎక్కడుందంటే..

మహాభారతంలోని హస్తినాపురానికి ఢిల్లీకి ఎలాంటి సంబంధం లేదు. అయితే అలాగని మహాభారతంలోని ఏ ప్రాంతానికీ సంబంధం లేదని కాదు. దీని గురించి కూడా తెలుసుకుందాం.

కౌరవులు కాండవప్రస్థంలో కొంత భూమిని పాండవులకు ఇచ్చిన విషయం గురించి హిందువులందరికీ తెలిసిందే. ఆ తర్వాత వారు దానికి రాజధానిగా ఇంద్రప్రస్థంను చేసుకుని పరిపాలన సాగించారు. ప్రస్తుతం ఆ ఇంద్రప్రస్థమే నేటి ఢిల్లీ అని చెబుతారు. ప్రస్తుతం ఢిల్లీ ఉన్న ప్రదేశం.. ఇంద్రప్రస్థం ఒక్కటేనని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని పురానా ఖిలా ప్రాంతం.. ఇంద్రప్రస్థ ప్రదేశంతో ముడిపడి ఉందంటారు.

Where is Indraprastha

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు ప్రదేశాల్లో నిర్వహించిన తవ్వకాల్లో పెయింటెడ్ గ్రే వేర్ వంటి కళాఖండాలు బయటపడటం.. అవి మహాభారత సంఘటనలకు లింక్ అయి ఉండటం కూడా దీనికి బలాన్నిస్తోంది. ఇంకా దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కౌరవుల రాజధాని అయిన హస్తినాపురం, పాండవుల రాజధాని అయిన ఇంద్రపస్థం రెండూ కూడా కురు రాజ్యంలోని విభిన్న ప్రదేశాలు. వాటిలో ఇంద్రప్రస్థం అనేది నేటి ఢిల్లీ ఒక్కటేనని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే హస్తినాపురం వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఉంది. ఇవి రెండూ మహాభారతం జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు అని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version