
రావణుడు సీతమ్మను అపహరించాడు. ఆ తరువాత లంకకు తీసుకెళ్లి అశోకవనంలో ఉంచాడు. సీత జాడ తెలుసుకునేందుకు శ్రీరామచంద్రుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. చివరకు ఆంజనేయుని సహకారంతో సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుని రావణ సంహారం గావించి సీతమ్మను తిరిగి తీసుకొచ్చాడు. అయితే రావణుడు.. అపహరించినప్పటికీ, ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకేందుకు సైతం సాహసించలేదు. అమ్మవారు అక్కడ చాలా పవిత్రంగా ఉంది. అయితే రావణుడు సీతమ్మను తాకకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని చెబుతారు.
వాటిలో ఒకటి అయితే సీతమ్మ తల్లి పతివ్రతా ధర్మమని పురాణాలు చెబుతున్నాయి. రెండవది రావణాసురుడికి ఉన్న రెండు శాపాలు. ఆ శాపాల కారణంగానే రావణుడు సీతమ్మను తాకలేదట. సీతమ్మ గొప్ప పతివ్రత. ఆమె తన మనస్సులో ఎప్పుడూ శ్రీరాముడినే స్మరిస్తూ ఉండేది. అందుకే మహారాణిలా జీవించాల్సిన ఆమె రాముడి వెంట అడవులకు సైతం వెళ్లింది. 14 ఏళ్ల వనవాసాన్ని భర్త చెంత సంతోషంగా గడిపింది. తన పవిత్రతను కాపాడుకుంటూనే అడవుల్లో జీవించింది. ఆమె ఆత్మబలం, పతివ్రతా ధర్మమే ఆమెను రావణుడు తాకకుండా నిలువరించింది.
