Site icon Bhakthi TV

రాఘవేంద్ర స్వామి అసలు పేరేంటి? ఆయనెప్పుడు సన్యాసం స్వీకరించారు?

రాఘవేంద్రస్వామి అసలు ఎప్పుడు జన్మించారు? ఆయన అసలు పేరు ఏంటి? ఆయన ఎప్పుడు సన్యాసం స్వీకరించారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1595లో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు వెంకటనాథుడు. ఆయనకు ఐదేళ్ల ప్రాయంలోనే వెంకటనాథుడితో అతని తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఆ తరువాత నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేనాటికే విద్యల సారాన్ని గ్రహించారు. ఆ తరువాత తన కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు.

తన పేరును మార్చుకున్న నాటి నుంచి రాఘవేంద్ర స్వామి ఆధ్యాత్మిక బోధనలు చేయడం ఆరంభించారు. తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. మంత్రాలయం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన తపస్సుకు సాక్షాత్తు పంచముఖ ఆంజనేయుడే ప్రసన్నమయ్యాడని చెబుతారు. అనంతరం రాఘవేంద్రుడు తన బోధనలను పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో కొనసాగించారు. అప్పుడే ఆయనకు మంచాల గ్రామాన్ని ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్‌ దానం చేశారు.

Share this post with your friends
Exit mobile version