Site icon Bhakthi TV

దొంగలను నంది కొమ్ములు ఏం చేశాయంటే..

గుంటూరు జిల్లాలోని ‘నందివెలుగు’ క్షేత్రంలో వినాయకుడి బొజ్జ, నంది కొమ్ములలోని రత్నాలను ఒకరోజు దొంగలు దొంగిలించుకు పోయారు. రత్నాలను సొంతం చేసుకున్న వారు ఆనందంతో పారిపోతున్న సమయంలో విరిచేసిన కొమ్ములు దొంగలను వెంబడించాయట. అప్పుడు భయంతో దొంగలు తలో దిక్కకు పరుగులు తీశారట. ఎంత పరిగెత్తినా నంది కొమ్ములు వారిని విడిపెట్టలేదట. చివరికి వారు నందికొమ్ముల చేతిలో బలైపోయారు. దొంగలు కొమ్ములను విరిచివేసినందునే ఈ క్షేత్రంలోని నందీశ్వరుడు కొమ్ములు లేకుండా దర్శనమిస్తాడని చెబుతారు.

దొంగలను నంది కొమ్ములు ఏం చేశాయంటే..

ఇక ఈ ఆలయానికి రత్నాల వెలుగులో ప్రకాశించే నందీశ్వరుడు ఉన్న ఆలయం కాబట్టి ఈ ఆలయానికి నందివెలుగు అని పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రస్తుతానికి ఒక సాధారణ ఆలయం మాదిరిగానే కనిపిస్తోంది. నాటి మహిమాన్విత ఘటనకు ఇది సాక్షిగా నిలుస్తోంది. ఈ క్షేత్రం నంది పేరిట ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడు కాబట్టి ఇక్కడ స్వామివారు అగస్తీశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో నిత్య పూజలకు ఎలాంటి లోటూ జరగదు. ఇక్కడ శివయ్యకు ఇష్టమైన సోమవారం నాడు స్వామివారికి అభిషేకంతో పాటు విశేష పూజలు నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version