Site icon Bhakthi TV

శ్రీరాముడికి, జమ్మి చెట్టుకి సంబంధం ఏమిటి?

పాండవులకి, జమ్మిచెట్టుకి ఏంటి సంబంధం అనేది అందరికీ తెలిసిందే. శ్రీ రాముడికి, జమ్మి చెట్టుకి మధ్య సంబంధం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.

సీతమ్మ వారిని లంకలో బంధించిన రావణుడిపై యుద్ధానికి వెళ్లడానికి ముందు శ్రీరాముడు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించాడని చెబుతారు. ఆ తరువాత యుద్ధంలో విజయం సాధించాడు. కాబట్టి జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఏ పనిలోనైనా విజయం సిద్ధిస్తుందని నమ్మకం. లంకలో రావణుడుపై విజయం కోసం రాముడు జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేశాడని చెబుతారు.

దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున జమ్మి చెట్టుని పూజించడం వల్ల శత్రువులపై విజయం, శని దోషం నుంచి ఉపశమనం, సంపద ప్రాప్తి లభిస్తాయి. అందుకే దసరా నాడు జమ్మి చెట్టుని పూజిస్తే చాలా మంచిదని చెబుతారు. ఇక జమ్మిచెట్టును పూజించడం వల్ల కలిగే మరికొన్ని లాభాలేంటంటే.. శత్రువుల నుంచి, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని ముందుగానే తెలుసుకున్నాం. జమ్మి చెట్టును పూజించే వారింట ఆనందం, శాంతి, సంపద , శ్రేయస్సు నెలకొంటాయట. అలాగే అన్నింటా విజయం సిద్ధిస్తుందట.

Share this post with your friends
Exit mobile version