Site icon Bhakthi TV

భోజనం ముందు చేసే పూర్వాపోశనం అంటే ఏమిటి?

బ్రాహ్మణాది త్రైవర్ణీకులు భోజనం చేసేముందు తప్పకుండా ఆపోశనపట్టి భుజించాలి. ముందుగా పూర్వాపోశనం అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఏమిటో ఎలాగో తెల్సుకుందాం. భోజనానికి పూర్వం నీటిని మంత్రపూర్వకంగా త్రాగే విధానాన్నే పూర్వఅపః+అశంనం= పూర్వాపోశంనం అని అంటారు. భోజనానికి విస్తరి ముందరకూర్చోని చేసే ప్రక్రియను పూర్వాపోశన అంటారు. పూర్వాపోశన విధానం ఎట్లా అంటే? చేతిలోకి నీటిని తీసుకొని గాయత్రీ మంత్రము చెప్పి ఆ నీటిని విస్తరిలోని అన్నాదిపదార్ధాల మీద (చల్లాలి) మార్జన చేయాలి.

ఆ తర్వాత కుడిచేతిలోకి నీరుతీసుకొని ఎడమచేతితో విస్తరిని (లేక కంచమును) తన‌ ఎదుటిభాగంలో మధ్యవేలితో తాకి అక్కడ నుంచి తన ఎడమచేతివైపు నుంచి కుడిచేతివైపు వరకూ తన చేతిలోని నీరుని పగలైతే ‘సత్యం తర్త్వేన పరిషించామి’ అని.. రాత్రైనట్లైతే ‘ఋతంత్వా సత్యేన పరిషించామి’ అని చెబుతూ.. ఆ నీటిని విస్తరి చుట్టూ పోయడం అంటే పరిషేచన చేయాలి. ‘అమృతమస్తు’ అంటూ కుడిచేతిలోకి నీరును వేయించుకొని, ‘అమృతాపిథానమసి’ అంటూ చేతిలో వేయించుకున్న ఆ నీటిని తాగాలి. ఆతర్వాత ఎడమచేతితో విస్తరిని తాకి కుడిచేతి బ్రొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేళ్ళతో అన్నం మెతుకులను తీసుకొని..

1.ఓంప్రాణాయస్వాహా
2.ఓంఅపానయస్వాహా
3.ఓంవ్యానాయస్వాహా
4.ఓంఉదానాయస్వాహా
5.ఓంసమానాయస్వాహా
అంటూ ఐదుసార్లు పళ్ళకు తగలకుండా అంగిట్లోకి వేసుకోవాలి.

Share this post with your friends
Exit mobile version