Site icon Bhakthi TV

లోకంలో ఏది శాశ్వతం? నిజమైన మిత్రుడెవరు?

యక్ష ప్రశ్నల్లో ఏడింటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో మూడు ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ధర్మరాజును యక్షుడు అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా లోక విఖ్యాతిగాంచాయి. వాటిలో ఒకటి.. లోకంలో శాశ్వతంగా ఉండేది ఏమిటి? అంటే.. పేరే శాశ్వతం. ఎందుకంటే మన మంచి పనులు మన పేరును నిలబెడతాయి. చెడు పనులు పేరును చెడగొడతాయి. కర్మలే మన గుర్తింపును నిర్ణయిస్తాయి. మంచి పేరు మనిషిని కాలం చేసిన తర్వాత కూడా నిలబెడుతుంది. అందుకే పేరే శాశ్వతం.

నిజమైన మిత్రుడు ఎవరు? అంటే.. కష్ట సమయంలో తోడుండేవాడే మిత్రుడు. సుఖంలో అందరూ ఉంటారు. బాధలో నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. మనసును అర్థం చేసుకుని ధైర్యం చెప్పేవాడే నిజమైన మిత్రుడు. చివరి ప్రశ్న వచ్చేసి మనిషి అసలు అందం ఏది? అంటే.. మాటే అసలు అందం ఎందుకంటే మధురమైన మాటలు హృదయాలను గెలుస్తాయి. కఠినమైన మాటలు మనసులను గాయపరుస్తాయి. మంచి మాటలు బంధాలను దగ్గర చేస్తాయి. మాట మనిషి స్వభావాన్ని చూపుతుంది.

Share this post with your friends
Exit mobile version