Site icon Bhakthi TV

కన్యా సంక్రమణం అంటే ఏమిటి? అదెప్పుడు?

కన్యా సంక్రమణం అంటే మరేదో కాదు.. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభ సందర్భాన్నే కన్యా సంక్రమణం అని కాని కన్యా సంక్రాంతి అని కాని అంటారు. అసలు ఈ కన్యా సంక్రమణం ఎప్పుడు సంభవించనుంది? అంటే.. తెలుగు పంచాంగం ప్రకారం రేపు (17వ తేదీ, బుధవారం) సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంక్రమించనున్నాడు. మరి ఈ రోజున ఏం చేయాలి అంటారా.

కన్యాసంక్రమణం నాడు సూర్యుని అనుగ్రహం కోసం పూజలు నిర్వహిస్తారు. అలాగే పితృదేవతలను సైతం స్మరించుకుంటారు. పితృదేవతలను స్మరించుకుంటూ దానధర్మాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున చాలా మంది నదీ స్నానం ఆచరిస్తారు. ఇలా నదీస్నానం ఆచరించడం చాలా మంచిదని భావిస్తారు. శరీరం శుద్ధి అవడమే కాకుండా మనసు కూడా శుద్ధి అవుతుందట. అలాగే నదీ స్నానం కారణంగా జన్మాంతర పాపాలన్నీ హరించుకుపోతాయట. ఒకవేళ నదీస్నానం ఆచరించలేని వారు చిన్న చెరువులోనైనా స్నానం చేస్తే ఫలితం బాగుంటుందట.

Share this post with your friends
Exit mobile version