Site icon Bhakthi TV

యమ దీపాన్ని వెలిగించడానికి నియమాలు ఏంటి?

యమ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలో తెలుసుకున్నాం కదా. ఈ యమ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయి. అంటే యమ దీపం ఎప్పుడూ కూడా దక్షిణం వైపు వెలిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశ అనేది యమ ధర్మరాజు దిశగా చెబుతారు. ఇలా చేస్తే దీపం వెలిగిస్తే యముడు సంతోషించి తద్వారా భయాల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. అయితే యమ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే.. యమ దీపం నాలుగు వత్తులతో నలువైపులా వెలిగించాలి. యమ దీపాన్ని వెలిగించేందుకు నువ్వుల నూనె లేదంటే ఆవ నూనెను వినియోగించాలి.

దీపం వెలిగించి దానిని ఇంటి దక్షిణ దిశలో పెట్టాలి. కుటుంబ సభ్యులంతా కష్టాల నుంచి విముక్తి కలిగించాలని.. దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే అకాల మృత్యు భయం ఉండదట. ఈ నియమాలు పాటిస్తూ యమ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇక దీపావళి పండుగ ధన్ తేరాస్‌తో ప్రారంభమవుతుందని తెలుసుకున్నాం కదా. ఈ రోజున సముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశంతో దర్శనమిచ్చాడని చెబుతారు. కాబట్టి ఈ రోజున లోహ వస్తువులు కొంటే చాలా మంచిదని నమ్మకం. అలాగే స్తోమత ఉన్నవారు బంగారం, వెండిని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది.

Share this post with your friends
Exit mobile version