
మీ ఇంటిగదులు ఎన్ని, ఎంత విశాలమైనవి? అని దేవుడు మనల్ని ఎప్పుడూ అడగడు. “నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు?” అని అడుగుతాడు. “నీది ఎన్ని అంకెల జీతం?” అని దేవుడు అడగడు. “నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది?” అని అడుగుతాడు. “నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నారు.?” అని అడగడు. “నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలుగుతున్నావు?” అని అడుగుతాడు. ‘‘ ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావు?” అని దేవుడు అడగడు. ‘‘ ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చుతున్నావు?” అని అడుగుతాడు.
“నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయి?” అని దేవుడు అడగడు. ‘‘నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావు?” అని అడుగుతాడు. “నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు?” అని దేవుడు అడగడు. ‘‘నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు?” అని అడుగుతాడు. “నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావు?” అని దేవుడు అడగడు. “నీవు ఎంత మానవ సేవ చేశావు?” అని అడుగుతాడు. “నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావు?” అని దేవుడు అడగడు. “ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి చూడు” అంటాడు దేవుడు. “ముక్తి పథానికి ఇంత ఆలస్యం చేశావేమి?” అని దేవుడు అడగడు.
“నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని తానే స్వయంగా నిన్ను స్వర్గ ధామానికి తీసుకు వెళ్తాడు.
