Site icon Bhakthi TV

నేడు సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీ దేవి శక్తి ఆయుధాన్ని ప్రసాదించిందట..

దేవతల మహాయజ్ఞం నుంచి భండాసుర సంహారార్థం ఆవిర్భవించిన జగన్మాత లలితా దేవి అవతార దినం ఈరోజు. కాబట్టి ఇవాళ దేశమంతా లలితా జయంతిని జరుపుకుంటోంది. ఈ మాఘ పౌర్ణమి రాత్రి చంద్రబింబాన్ని పాలలో దర్శిస్తూ లలితా దేవిని ధ్యానించి వెన్నెల పారాయణం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని బ్రహ్మాండ పురాణ వాక్యం.

తైపూసం..
తారకాసుర సంహారార్థం అవతరించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీ దేవి శక్తి ఆయుధం (వేలు) ప్రసాదించిన పవిత్ర దినం. జ్ఞాన సిద్ధి, ఆత్మబల వృద్ధికి ఈ రోజు మురుగన్ ఆరాధన అత్యంత ఫలప్రదం.

సర్వార్థ సిద్ధి – సిద్ధ యోగాలు
ఈ ఘడియల్లో చేసే ప్రతి ప్రయత్నం విజయాన్ని అందిస్తుంది. చిన్న పూజైనా, స్వల్ప దానమైనా వందల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.
ఈ రోజున పుణ్యస్నానం ఆచరించడంతో పాటు పూజ, ధ్యానం, జపం చేస్తారు. అలాగే తమ శక్తి మేరకు దానం చేస్తారు. ఇంతటి విశిష్టతలతో కూడిన ఈ మహాపుణ్య దినాన్ని వృథా చేయక, ఆధ్యాత్మిక సాధన చేస్తారు.

Share this post with your friends
Exit mobile version