Site icon Bhakthi TV

దేవతలు, శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడకపోవడానికి కారణమిదే..

శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణ కోసం భూమిపై అవతరించబోతున్నాడన్న విషయం తెలియగానే దేవతలంగా ఆయన లీలలను చూసేందుకు భూమిపైకి రావాలని తలిచారట. కొందరు తమకు బదులుగా తమ కుమారులను భూమిపైకి పంపారట. అలా వచ్చిన వారే.. సూర్యుని కుమారుడు కర్ణుడు, ఇంద్రుని కుమారుడు అభిమన్యుడు. ముందుగా వర్చ (అభిమన్యుడు) భూలోకంలో జన్మించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తండ్రి చంద్రుడిని కోరాడట. అయితే చంద్రుడుకి తన కొడుకు అంటే వల్లమాలిన ప్రేమ కావడంతో కొడుక్కి దూరంగా ఉండేందుకు ఇష్టపడక ఇవ్వనని చెప్పాడట.

అయితే అభిమన్యుడు పట్టుబట్టడంతో పాటు దేవతలంతా చంద్రుడిని అతని కుమారుడు భూమిపై జన్మించేలా వరమివ్వమని కోరడంతో చేసేదేమీ లేక 16 ఏళ్లు మాత్రమే భూమిపై ఉండేలా వరం ఇచ్చాడట. ఆ తరువాత తిరిగి వచ్చేయాలన్న కండీషన్‌తో పంపాడట. అలా చంద్రుడు కొడుకు వర్చ కాస్తా అర్జునుడి కొడుకు అభిమన్యుడుగా జన్మించాడు. అందుకే అభిమన్యుడు 16 ఏళ్లకే మరణిస్తున్నా ఏ దేవతలు కానీ.. శ్రీకృష్ణుడు కానీ అడ్డుకోలేదట. ఈ వాగ్దానం కారణంగా అభిమన్యుడు 16 ఏళ్లకే అమరవీరుడై తిరిగి చంద్రుడి వద్దకు వెళ్లిపోయాడట.

Share this post with your friends
Exit mobile version