Site icon Bhakthi TV

స్త్రీలు వెండి పట్టీలను ధరించడం వెనుక శాస్త్రీయ కారణమేంటంటే..

మహిళలు వెండి పట్టీలు ధరించడం సర్వసాధారణం. అయితే వెండి పట్టీలు ధరించడం వెనుక శాస్త్రీయ కారణాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా వివాహితలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా వెండి పట్టీలను ధరిస్తారు. వీటిని మహిళలు ధరిస్తే ఇంటికి సంతోషం, శ్రేయస్సు, ఆనందం వంటివి లభిస్తాయట. అలాగే వెండి చల్లదనం, శాంతి, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు పాదాలకు వెండి పట్టీలు ధరించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని నమ్మకం. పట్టీల శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేసి మనసుకు ప్రశాంతతను ఇస్తుందని చెబుతారు.

మహిళలు వెండి పట్టీలను ధరించడం వలన వైవాహిక జీవితంలో మాధుర్యం, శ్రేయస్సు తెస్తాయని నమ్మకం. అలాగే శాస్త్రీయ కోణం ఏంటంటే.. శరీరంలో శక్తిని పెంచుతుందట. పట్టీలు ధరించడం వలన చీలమండల వద్ద పట్టీలు ఒత్తిడి కలిగిస్తాయి. తద్వారా ఆక్యుప్రెషర్ ప్రభావం చూపుతాయి, పాదాల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే మహిళల్లో హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతాయి. అలాగే వెండి యాంటీ బయాటిక్‌గా కూడా పని చేస్తుంది. వెండిలోని యాంటీవైరల్ లక్షణాలు.. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయట. వెండి లోహంలో శీతలీకరణ లక్షణాలుండటం వలన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

Share this post with your friends
Exit mobile version